ఆళ్లగడ్డ, 9 జూన్ (హి.స.)ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే (Allagadda TDP MLA) భూమా అఖిలప్రియ (BHUMA AKHILA PRIYA) అస్వస్థత (illness)కు గురయ్యారు.
ఈ రోజు ఉదయం డబ్ల్యూ గోవిందిన్నె లోని మూల పెద్దమ్మ దేవరలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. స్పృహతప్పి పడిపోయారు. ఇది గమనించిన నేతలు.. మహిళా ఎమ్మెల్యే (Woman MLA)ను హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అనంతరం వైద్యులు ఎమ్మెల్యేకు వైద్యం అందించి.. వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికి డాక్టర్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి