న్యూఢిల్లీ:, 17 జూలై (హి.స.)అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 1 ఒక ముఖ్యమైన రోజు అవుతుందని.. ఆ రోజు తన దేశానికి చాలా డబ్బు వస్తుందని వ్యాఖ్యానించారు. సుంకాలపై ట్రంప్ విధించిన గడువు దగ్గర పడుతోంది. ఆగస్టు 1తో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఒప్పందం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ పేర్కొ్న్నారు.
త్వరలో భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సూచించారు. భారత మార్కెట్లలోకి ప్రవేశం కల్పించే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని పేర్కొ్న్నారు. ఇక ఇండోనేషియాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఇండోనేషియా 19 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ