న్యూఢిల్లీ:, 17 జూలై (హి.స.)బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్- కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మొదటి నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ సరసమైన ధరలకే విద్యుత్ అందిస్తున్నాము. ఆగస్టు 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ అమలవుతుంది. జులై నెల బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు.
125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. రానున్న మూడేళ్లలో.. ప్రజల అంగీకారంతో వారి ఇళ్లపై లేదా ప్రభుత్వ స్థలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. కుటిర్ జ్యోతి స్కీమ్ కింద పేదవారి ఇళ్లపై ఫ్రీగా సోలార్ ప్లాంట్లు అమరుస్తాము. మిగిలిన వారికి ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ