పాక్‌కు గూఢచర్యం.. జమ్మూకశ్మీర్‌లో సైనికుడి అరెస్టు
న్యూఢిల్లీ: , 17 జూలై (హి.స.)భారత్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్‌కు చెందిన ఐఎస్‌ఐకు మన సైనిక సమాచారం లీక్‌ చేస్తున్నాడనే ఆరోపణలతో ఓ సైనికుడిని పంజాబ్‌ పోలీస
పాక్‌కు గూఢచర్యం.. జమ్మూకశ్మీర్‌లో సైనికుడి అరెస్టు


న్యూఢిల్లీ: , 17 జూలై (హి.స.)భారత్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్‌కు చెందిన ఐఎస్‌ఐకు మన సైనిక సమాచారం లీక్‌ చేస్తున్నాడనే ఆరోపణలతో ఓ సైనికుడిని పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు (pak spy).

పంజాబ్‌లో సంగ్రూర్‌ జిల్లాలోని నిహల్‌గఢ్‌ గ్రామానికి చెందిన దేవీందర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడు జమ్మూకశ్మీర్‌లోని ఉరిలో జవానుగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణల కేసులో ఇటీవల మాజీ సైనికుడు గుర్‌ప్రీత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని విచారించగా ఈ దేవీందర్‌ పేరు బయటకు వచ్చిందని తెలిపారు. వీరిద్దరూ 2017లో పుణెలోని ఆర్మీ క్యాంప్‌లో మొదటిసారిగా కలిశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అక్కడి నుంచి వీరి మధ్య స్నేహం బలపడిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande