బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..
ముంబై, 18 జూలై (హి.స.) వేల ఏళ్ల నుంచి వన్నె తగ్గని, ఫేడ్ అవుట్ అవ్వని ఖనిజం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బంగారమే అని చెప్పాలి. రోజు రోజుకు బంగారం డిమాండ్ పెరుగుతూ పోతోందే తప్ప తగ్గటం లేదు. జనం బంగారాన్ని ఒంటిమీద నగలాగా మాత్రమే కాకుండా భవిష్యత్ పెట్
Gold


ముంబై, 18 జూలై (హి.స.)

వేల ఏళ్ల నుంచి వన్నె తగ్గని, ఫేడ్ అవుట్ అవ్వని ఖనిజం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బంగారమే అని చెప్పాలి. రోజు రోజుకు బంగారం డిమాండ్ పెరుగుతూ పోతోందే తప్ప తగ్గటం లేదు. జనం బంగారాన్ని ఒంటిమీద నగలాగా మాత్రమే కాకుండా భవిష్యత్ పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. అందుకే ప్రపంచం నలుమూలలా ఉన్న జనం బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష దగ్గర ట్రేడ్ అవుతోంది.

నేటి బంగారం ధరలు ఇలా..

భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,330 రూపాయల దగ్గర..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,340 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,060 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,400 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,24,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,390 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,23,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande