రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ముంబై, 12 జూలై (హి.స.)గత ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరి అందరినీ షాక్ చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ధర లక్ష దాటుతుందని భయపడేలోగా.. జూన్ చివరకు లక్ష నుంచి 94 వేలకు పడిపోయింది.
Gold


ముంబై, 12 జూలై (హి.స.)గత ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరి అందరినీ షాక్ చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ధర లక్ష దాటుతుందని భయపడేలోగా.. జూన్ చివరకు లక్ష నుంచి 94 వేలకు పడిపోయింది. శుభకార్యాలకు ఆభరణాలు కొనాలనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. పది రోజుల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 99 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,750 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,250 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,010 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,760 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

విశాఖపట్నం – 98,840

రాజమండ్రి – 98,730

ముంబై – 98,730

చెన్నై – 98,730

బెంగళూరు – 98,730

కోల్‌కతా – 98,730

ఢిల్లీ – 98,880

అహ్మదాబాద్ – 98,700

భువనేశ్వర్ – 98,720

వెండి ధరలు ..

బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ఓ రోజు పెరుగుతున్నాయ్.. మరో రోజు తగ్గుతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,100 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,21,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,110 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,21,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande