
ముంబై, 16 మార్చి (హి.స.)బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరల పతనం ఇలాగే కొనసాగే అవకాశముందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు నిజమయ్యేలా ఈ వారం ప్రారంభంలోనే ధరలు మరోసారి కుల్పకూలాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
గోల్డ్ రేట్లు ఇలా..
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,59,650గా కొనసాగుతోండగా.. నిన్న రూ.1,59,660 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,46,340 వద్ద ఉండగా.. ఆదివారం రూ.1,46,350 వద్ద ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల రేటు రూ.1,59,650గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,46,340 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,010 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,590 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,650 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,340 వద్ద ట్రేడవుతోంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,46,490 వద్ద ట్రేడవుతోంది.
వెండి రేట్లు ఇవే..
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,74,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2,75,000 వద్ద స్ధిరపడింది.
-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,79,900గా ఉండగా.. నిన్న రూ.2.80 లక్షలుగా ఉంది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,74,900గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV