
ముంబై, 21 ఏప్రిల్ (హి.స.)
ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతుండగా, అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది. గతంలో కిలో వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల వరకు వెళ్లిగా ప్రస్తుతం చూస్తే భారీగా తగ్గిపోయింది. దాదాపు లక్ష రూపాయలకుపైగానే పడిపోయింది.గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడటం, పశ్చిమాసియాలో అనిశ్చితి పెరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. కామెక్స్ లో బంగారం ధర రూ. 1.21శాతం తగ్గి ఔన్సుకు 4, 821 డాలర్లకు చేరింది. వెండి ధర రూ. 2.05శాతం తగ్గి ఔన్సుకు 80.16 డాలర్లకు చేరుకుంది. అయితే మంగళవారం ధరలను పరిశీలిస్తే దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయ
ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,280కు చేరుకుంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,42,340కు చేరింది. 999శాతం స్వచ్ఛమైన వెండి ధర కిలోగ్రాముకు రూ. 2,74,90కి చేరింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV