మహిళలను నిరుత్సాహపర్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?
అక్షయ తృతీయ సందర్భంగా కిటకిటలాడుతున్న బంగారం షాపులు
Gold


ముంబై, 20 ఏప్రిల్ (హి.స.)దేశంలో అక్షయ తృతీయ సందర్భంగా పలు బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడాయి. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మహిళలు కొనుగోళ్లు చేశారు. ఆదివారం నిలకడగా ఉన్న బంగారం ధరలు ఏప్రిల్ 20వ తేదీన సోమవారం అతి స్వల్పంగా తగ్గింది. అంటే తులం బంగారం పై కేవలం 10 రూపాయలు మాత్రమే దిగి రావడం మహిళలను నిరుత్సాహపర్చింది.

అక్షయతృతీయ రోజు భారీగా తగ్గుతుందని భావించినప్పటికీ అతి స్వల్పంగానే తగ్గింది. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,55,770 వద్ద కొనసాగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande