కదిరి .మండలం కుమ్మరవాండ్ల పల్లెలో వైకాపా నాయకుడు హరిప్రసాద్ నివాసంలో. సిబిఐ తనిఖీలు
కదిరి, 2 జూలై (హి.స.) , కదిరి గ్రామీణం, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిల్లా వైకాపా నాయకుడు డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ నివాసంలో మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో హరిప్రసాద్‌ అందుబాటులో లేరు. ఆయన కుటు
కదిరి .మండలం  కుమ్మరవాండ్ల పల్లెలో  వైకాపా నాయకుడు హరిప్రసాద్ నివాసంలో. సిబిఐ తనిఖీలు


కదిరి, 2 జూలై (హి.స.)

, కదిరి గ్రామీణం, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిల్లా వైకాపా నాయకుడు డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ నివాసంలో మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో హరిప్రసాద్‌ అందుబాటులో లేరు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు... అవసరమైన సమాచారాన్ని సేకరించారు. వైద్యకళాశాలల్లో సీట్ల భర్తీ, ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇప్పించే విషయంలో భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ సీఐ శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. అర్ధరాత్రి 12 గంటల తరువాత కూడా తనిఖీలు కొనసాగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande