జూన్ నెలలో తిరుమల ను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు
తిరుమల, 2 జూలై (హి.స.) :కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి ( దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడిని కనులారా చూసి పులకించిపోతుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి మరీ శ్రీవారిని దర్శించుకుని తన్మయత్వం చెంద
జూన్ నెలలో తిరుమల ను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు


తిరుమల, 2 జూలై (హి.స.)

:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి ( దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడిని కనులారా చూసి పులకించిపోతుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి మరీ శ్రీవారిని దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. ఒక్కోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం కాంప్లెక్స్‌లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లలో కూడా భక్తులు వేచి ఉంటారు. గతంలో సెలవులు, వారంతరాల్లో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వారంతో సంబంధం లేకుండా శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే జూన్ రెండో వారం నుంచి స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు ప్రారంభానికి ముందే తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande