అమరావతి, 2 జూలై (హి.స.)
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది. అయినా కూడా ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ఆలయం పైనుంచి విమానాలు ఎలా వెళ్తాయంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీకి ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తిరుమలలో సెక్యూరిటీ పెంచారు. తిరుమలకు ముప్పు పొంచి ఉందని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా కూడా తాజాగా శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ