పశ్చిమగోదావరి, 2 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో విస్తృతమైన సంక్షేమ అజెండాను ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో రెండు పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకుమంత్రి నిమ్మల రామానాయుడు ఈ రెండు పథకాల గురించి కీలక ప్రకటన చేశారు.మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడుప్రకటించారు. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ