హైదరాబాద్ సమీపం లోని. పాశ మైలారం పేలుడు ఘటనలో కొత్త జంట దుర్మరణం
హైదరాబాద్, 2 జూలై (హి.స.) ఒకేచోట కొలువుదీరారు.. అక్కడే మనసులు కలిశాయి.. ఆప్యాయతలు విరబూశాయి.. మూడు ముళ్లతో.. ఏడడుగులతో... జీవితాంతం కలిసి ఉండాలని భావించారు.. పెద్దలు సమ్మతించకున్నా రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు.. పరిణామాలను ఎమ్మెల్యే కొలికపూడికి
హైదరాబాద్ సమీపం లోని. పాశ మైలారం పేలుడు ఘటనలో కొత్త జంట దుర్మరణం


హైదరాబాద్, 2 జూలై (హి.స.)

ఒకేచోట కొలువుదీరారు.. అక్కడే మనసులు కలిశాయి.. ఆప్యాయతలు విరబూశాయి.. మూడు ముళ్లతో.. ఏడడుగులతో... జీవితాంతం కలిసి ఉండాలని భావించారు.. పెద్దలు సమ్మతించకున్నా రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు.. పరిణామాలను ఎమ్మెల్యే కొలికపూడికి వివరించగా.. ఆయన పెద్దలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. ఇటీవల యువ జంటను.. ఎమ్మెల్యే దంపతులు వారింటికి పిలిచి ఆశీర్వదించారు. అన్యోన్యానికి ప్రతిరూపమైన జంటను చూసి విధికి కన్నుకుట్టిందేమో.. కలిసి జీవించాలనే వారి కలలను ఆదిలోనే చిదిమేసింది. హైదరాబాద్‌ సమీప పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన పేలుడులో వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. వెరసి యువతి రామాల శ్రీరమ్య(25) స్వస్థలం విస్సన్నపేట మండలం పుట్రేలలో విషాదం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande