అన్నమయ్య.జిల్లా రాయచోటి లో ఇద్దరు.ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు
రాయచోటి, 2 జూలై (హి.స.) ,:అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మేళపలయంకు చెందిన అబూబక్కర్‌, మొహమ్మద్‌ అలీ అలియాస్‌ యూసఫ్‌ అన్నదమ్ములు. అనేక ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొని గత 30ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వీ
అన్నమయ్య.జిల్లా రాయచోటి లో ఇద్దరు.ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు


రాయచోటి, 2 జూలై (హి.స.)

,:అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మేళపలయంకు చెందిన అబూబక్కర్‌, మొహమ్మద్‌ అలీ అలియాస్‌ యూసఫ్‌ అన్నదమ్ములు. అనేక ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొని గత 30ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వీరిద్దరినీ తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1995 నుంచి పరారీలో ఉన్న అబూబక్కర్‌పై అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. ఇతను రాయచోటి పట్టణం కొత్తపల్లె ఉర్దూ పాఠశాల ఎదురుగా అమానుల్లా పేరుతో చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికులు ఇతడిని కేరళ కుట్టీగా పిలుస్తారు. ఇక మొహమ్మద్‌ అలీ 1999లో తమిళనాడు, కేరళల్లో బాంబులు పెట్టిన ఘటనల్లో నిందితుడు. ఇతడికి రాయచోటి మహబూబ్‌బాషా వీధిలో సొంత ఇల్లు ఉంది. చీరల వ్యాపారంతో పాటు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ అప్పుడప్పుడు కొన్ని నెలల పాటు కనిపించకుండా పోతారని, ఎవరైనా అడిగితే వ్యాపారం నిమిత్తం వెళ్లామని చెబుతారని స్థానికులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande