పాపికొండలు విహారయాత్రకు బ్రేక్
అమరావతి, 2 జూలై (హి.స.)పాపికొండులు విహారయాత్రకు బ్రేక్ పడింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లూరి జిల్లా దేవిపట్నం నుండి పాపికొండలు విహారయాత్రను తాత్క
పాపికొండలు విహారయాత్రకు బ్రేక్


అమరావతి, 2 జూలై (హి.స.)పాపికొండులు విహారయాత్రకు బ్రేక్ పడింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లూరి జిల్లా దేవిపట్నం నుండి పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. నీటిమట్టం పెరగడంతో పాటు వర్షం కురుస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వర్షాల కారణంగా దేవిపట్నంలోని రెండు గ్రామాల మధ్య రహదారిపై నుండి గోవావరి ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే పాపికొండలు విహారయాత్రకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు వెళుతుంటారు. ఇప్పుడు ఆ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి నీటిమట్టం తగ్గిన తరవాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande