జూన్ నెలలో తిరుమలకు ఎంత ఆదాయం వచ్చిందంటే?
తిరుమల, 2 జూలై (హి.స.)కలియుగ దైవం తిరుమల తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశావిదేశాల నుంచి నిత్యం భక్తులు (Devotees) భారీగా తరలివస్తుంటారు. ఇక వేసవి సెలవులు ముగింపుకు రావటంతో జూన్ (June) నెలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింద
జూన్ నెలలో తిరుమలకు ఎంత ఆదాయం వచ్చిందంటే?


తిరుమల, 2 జూలై (హి.స.)కలియుగ దైవం తిరుమల తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశావిదేశాల నుంచి నిత్యం భక్తులు (Devotees) భారీగా తరలివస్తుంటారు. ఇక వేసవి సెలవులు ముగింపుకు రావటంతో జూన్ (June) నెలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే 24 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాదు, ఇందులో జూన్ 14వ తేదీన అత్యధికంగా 91,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఇక భక్తుల రద్దీ పెరగటంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో సమకూరింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ప్రకారం ఒక్క జూన్‌ నెలలోనే రూ.120.35 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అదే మే నెలలో అయితే, రూ.106.83 కోట్లు వచ్చినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande