తిరుమల, 2 జూలై (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో గత రెండు నెలలుగా భక్తుల రద్ధీ (Crowd of devotees) కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్యలో అమావాస్య సందర్భంగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్ధీ మళ్లీ పెరిగింది. ప్రతి రోజు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగానే సమయం పట్టింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం కూడా భక్తుల రద్ధీ భారీగా కనిపించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు(మంగళవారం) తిరుమల తిరుపతిలో భక్తుల రద్ధీ (Crowd of devotees) భారీగా తగ్గిపోయింది. నేటి తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు నాలుగు కంపార్ట్మెంట్ల (Four compartments)లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం (10 hours of time) పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారిని 76, 126 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో భక్తుల కానుకలతో నిన్న శ్రీవారికి రూ. 3.97 కోట్ల హుండీ ఆదాయం వచ్చి చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి