సింగపూర్‌ పర్యటన అవినీతి సొమ్మును దాచేందుకే
హైదరాబాద్, 27 జూలై (హి.స.)విశాఖ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సింగపూర్‌ పర్యటనే ఉంటుందని, అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచు వెళ్తుంటారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీసీ నేత గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. ఈ రోజు( ఆదివారం, జూలై
సింగపూర్‌ పర్యటన అవినీతి సొమ్మును దాచేందుకే


హైదరాబాద్, 27 జూలై (హి.స.)విశాఖ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సింగపూర్‌ పర్యటనే ఉంటుందని, అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచు వెళ్తుంటారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీసీ నేత గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. ఈ రోజు( ఆదివారం, జూలై 27) విశాఖ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అమర్నాథ్‌.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో రూ. 3 వేల కోట్ల భూములను వాళ్లకు కావాల్సిన వారికి అప్పగించే పనిలో ఉన్నారని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande