నందికొట్కూరు, 28 జూలై (హి.స.): నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల వద్దనున్న హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీ నీవా ప్రధాన కాలువకు ఏడు పంపుల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. సోమవారం 2, 3,7,8,9,10,11 పంపుల ద్వారా 2.367 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలైలో ఈ స్థాయిలో నీటి విడుదల చేయడం ఇదే మొదటి సారి. ఈ నెల 17న మల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంపుల ద్వారా నీటిని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే మండలంలోని బ్రాహ్మణ కొట్కూరు ఫేజ్2 ఎత్తిపోతల పథకం నుంచి ఎనిమిది పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి