తెలంగాణ, గజ్వేల్. 28 జూలై (హి.స.)
గజ్వేల్ డివిజన్ పరిధిలో గత
కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన 28 ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) టెక్నాలజీతో రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఒక ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. సుమారు రూ. 3,30,000 లక్షల విలువజేసే 28 ఫోన్లను ట్రాప్ చేసి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.
సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయిన, ఎవ్వరైనా దొంగలించుకుపోయినా వెంటనే (సీఈఐఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ లో డాటా నమోదు చేయాలని తద్వారా ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఫోన్ దొరికిన, ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు