ఎమ్మార్వో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రోడ్డు పై బైఠాయించి రైతుల ధర్నా
తెలంగాణ, కామారెడ్డి. 28 జూలై (హి.స.) తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో జంగారెడ్డిగూడెం ఎమ్మార్వో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారి పై రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. రైతులకు న్యాయం చేయని ఎమ్మార్వో
రైతుల ధర్నా


తెలంగాణ, కామారెడ్డి. 28 జూలై (హి.స.)

తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో జంగారెడ్డిగూడెం ఎమ్మార్వో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారి పై రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. రైతులకు న్యాయం చేయని ఎమ్మార్వో మాకు వద్దు అంటూ నినదించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో పనిచేసిన తహశీల్దార్ 372, 373, 374 సర్వే నంబర్లలోని 115 మంది రైతులు 40 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారని, అందులో 20 ఎకరాల భూములకు పట్టాలు మంజూరు చేశారు. అయితే ఈ 372, 374 సర్వే నంబర్లలో ఇంకా 20 ఎకరాల భూమికి సంబంధించి గత సంవత్సరంలో పంచనామా చేసి సంవత్సరం గడుస్తున్నా, ప్రస్తుత ఎమ్మార్వో పట్టాల పంపిణీలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు 20 మంది రైతులు ఎమ్మార్వోను కలిసినప్పుడు వారి పట్ల ఎమ్మార్వో మాట్లాడిన తీరు తమను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని రైతులు వాపోయారు. గత 30 సంవత్సరాల నుండి రికార్డుకు ఉన్న భూమిని మేము ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ? అని ఎమ్మార్వో తమతో అన్నట్లు రైతులు తెలిపారు. 50 సంవత్సరాలుగా తమ కబ్జాలో ఉన్న భూములకు హక్కులు కల్పించడంలో ఎమ్మార్వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించిన రైతులు రహదారి పై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఎమ్మార్వో వచ్చి స్వయంగా హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని ప్రతిఘటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande