హైదరాబాద్, 28 జూలై (హి.స.)
బీజేపీ ఎంపీ సీఎం. రమేష్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేదర్ రెడ్డి అన్నారు. మీ చెల్లెలు ఏం అంటుందో చూశామని, సీఎం ఏం అంటున్నారో చూశామని వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. చేసిన తప్పుల నుండి కాపాడితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారట...మీ సోదరి కూడా దాన్ని విభేదించినట్టు చెప్పిందన్నారు. సీఎం రమేష్ వద్ద వీడియె క్లిప్పింగ్స్ ఉన్నాయని అంటున్నారని ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలను ఎవరు అభివృద్ధి చేశారో ప్రజల సమక్షంలో తేల్చేందుకు కేటీఆర్ చర్చకు రావాలన్నారు. వరంగల్ జిల్లాను పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందో, పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందో చర్చిద్దామని చెప్పారు. తాను ఒక్కడినే వస్తానని, కేటీఆర్ ఎంతమందినైనా తీసుకురావచ్చన్నారు. కేటీఆర్ పెట్టిన ప్రెస్ క్లబ్ కు రమ్మంటే అక్కడకే వస్తానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ అభివృద్ధి చేసినట్టు తేలితే ముక్కు నేలకు రాసివెళతానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్