నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ రేట్ల తగ్గింపు
అమరావతి, 28 జూలై (హి.స.) ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ''హరి హర వీరమల్లు'' ఈ నెల 24వ తేదీన విడుదలైన విషయం విదితమే. ఈ సినిమా విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను కూడా పెంచారు. ఇందుక
నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ రేట్ల తగ్గింపు


అమరావతి, 28 జూలై (హి.స.) ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదలైన విషయం విదితమే. ఈ సినిమా విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను కూడా పెంచారు. ఇందుకు ప్రభుత్వాలు అనుమతించాయి.

పవన్ కల్యాణ్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా పెంచిన టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది. నేటి (సోమవారం) నుంచి సాధారణ ధరలకే ఈ సినిమా టికెట్లు లభించనున్నాయి.

ఈ నేపథ్యంలో బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ టికెట్ రూ.175లు, మల్టీ ప్లెక్స్‌లలో రూ.295లకే టికెట్లు లభించనున్నాయి. దీంతో సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande