జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ట్రక్కు ఢీ.. 18 మంది యాత్రికులు మృతి.. 12 మందికి గాయాలు
దేవ్‌ఘర్‌, 29 జూలై (హి.స.)జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది భక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. బాబా నగరి ద
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ట్రక్కు ఢీ.. 18 మంది యాత్రికులు మృతి.. 12 మందికి గాయాలు


దేవ్‌ఘర్‌, 29 జూలై (హి.స.)జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది భక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. బాబా నగరి దేవ్‌ఘర్‌లో ఉన్న బాబా వైద్య నాథ్ ధామ్‌లో జలాభిషేకం చేసిన తర్వాత.. భక్తులు బస్సుని తీసుకుని దుమ్కాలోని వాసుకి నాథ్ ఆలయంలో జలాభిషేకం చేయడానికి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమునియాలో కన్వారియాలతో నిండిన బస్సు ఎల్‌పిజి సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కన్వారియాలు సంఘటనా స్థలంలోనే మరణించారు.

కాగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎంపీ నిషికాంత్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మంది భక్తులు మరణించినట్లు పోస్ట్ చేశారు. తన లోక్‌సభ నియోజకవర్గమైన దేవఘర్‌లో శ్రావణ మాసంలో నిర్వహించే కావడి యాత్రని చేపట్టిన భక్తులు ఎక్కిన బస్సు.. ట్రక్కు ఢీ కొంది. బాబా వైద్య నాథ్ మృతుల కుటుంబాలకు తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధని భరించే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నా అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande