నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, 29 జూలై (హి.స.) కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష రద్దు అంటూ నేడు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు గ్రాండ్ ముఫీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియ
నిమిషా ప్రియా


న్యూఢిల్లీ, 29 జూలై (హి.స.)

కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష రద్దు అంటూ నేడు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు గ్రాండ్ ముఫీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఉరిశిక్ష రద్దు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవేమనని, ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

నిమిష ప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి. దీంతో మళ్లీ ఈ కేసులో ఉత్కంఠ చోటుచేసుకుంది. నిమిషా ప్రియ కేసు 2018 నుంచి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande