నాసా-ఇస్రో కీలక ప్రయోగం.. భూమిపై అణువణువు స్కాన్..!
దిల్లీ,29 జూలై (హి.స.) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. నాసాతో కలిసి కీలక ప్రయోగానికి రెడీ అయ్యింది.. రేపు జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ను ప్రయోగించనుంది.. దీని కోసం ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకి కౌంట్ డౌన్‌ను ప్రారంభిం
ISRO PSLV PS4


దిల్లీ,29 జూలై (హి.స.)

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. నాసాతో కలిసి కీలక ప్రయోగానికి రెడీ అయ్యింది.. రేపు జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ను ప్రయోగించనుంది.. దీని కోసం ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకి కౌంట్ డౌన్‌ను ప్రారంభించనుంది.. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ పూర్తి చేసి.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో లాంచ్‌ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5.40 గంటలకి ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపించనున్నారు.. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన 2,393 కిలోల బరువుగుల నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నారు.. భూమి అణువణును 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయగల సామర్థ్యం ఈ నిసార్ సొంతం.. అడవులు, మైదానాలు, కొండలు పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటిని అధ్యయనం చేయనుంది నిసార్.. ఇందులో నాసాకి చెందిన ఎల్-బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్-బ్యాండ్ ర్యాడార్లని అమర్చారు శాస్త్రవేత్తలు.. ఇక, జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 రాకెట్‌ ప్రయోగం నేపథ్‌యంలో శ్రీహరికోటకి రానున్నారు నాసా శాస్త్రవేత్తలు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande