దిల్లీ:29 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల విద్యుత్ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ 2021 ఏడాది మొదట్లో కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. అదే ఏడాది జూలై 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే జల విద్యుదుత్పత్తిపై తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబరు 7న సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఆ రెండు పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ అంశంలో సుదీర్ఘ వాదనలు వినాల్సిన అవసరం ఉన్నందున కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ