దిల్లీ,29 జూలై (హి.స.)
హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు వెంటాడుతున్నాయి. ఇటీవల భారీ వరదలు కారణంగా రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. తేరుకునేలోపే మరోసారి జలఖడ్గం విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున మండిలో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. కుండపోతగా కురిసిన వర్షంతో మండి అతలాకుతలం అయింది. ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బతుకుజీవుడా అంటూ స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందరూ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. నిద్రలోంచి తేరుకునేలోపే అకస్మాత్తుగా వరదలు ముంచుకొచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ప్రకృతి విధ్వంసంతో మండి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. రహదారులు మూసుకుపోయాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. అంతా అంధకారం.. ఏం చేయాలో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోయారు. క
.‘
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ