అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
వాషింగ్టన్: 29 జూలై (హి.స.) అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారితో సహా ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్‌ఎస్‌ నివేదిక ప్రకారం కాల్పులు జరిప
అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి


వాషింగ్టన్: 29 జూలై (హి.స.) అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారితో సహా ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్‌ఎస్‌ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్‌ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లకు సమీపంలోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలోని ఒక భవనంపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటళ్లు, కోల్గేట్-పామోలివ్, ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నాయి. మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande