దిల్లీ,29 జూలై (హి.స.)దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీ అంతటా కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచే చీకట్లు అలుముకున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఇక భారీ వర్షం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాణాల్లో మార్పులు.. చేర్పులు ఉంటాయని విమానయాన సంస్థలు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈదురుగాలుల కారణంగా విమాన కార్యకలాపాల్లో ఇబ్బందులుంటాయని ఎయిరిండియా తెలిపింది
ఇదిలా ఉంటే ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ అంతటా, ఎన్‌సీఆర్ తూర్పు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ