ఢిల్లీ, 29 జూలై (హి.స.)కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద మనసు చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా అనాథలుగా మారిన 22 మంది చిన్నారుల ఆలన పాలన స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఈ 22 మంది చిన్నారులు జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాకు చెందినవారు.
రాహుల్ గాంధీ ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా, పూంఛ్ ప్రాంతంలో తల్లిదండ్రులను, కుటుంబాలను కోల్పోయిన చిన్నారుల జాబితాను తనకు ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ 22 మంది చిన్నారులతో కూడిన జాబితాను రూపొందించి రాహుల్ గాంధీకి అందజేశారు.
ఇక ఆ చిన్నారుల బాధ్యతను రాహుల్ గాంధీయే చూసుకుంటారని, వారికి గ్రాడ్యుయేషన్ వరకు విద్య, వైద్యం, ఇతర ఖర్చులన్నీ రాహుల్ భరిస్తారని హమీద్ వివరించారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి