పాక్‌ సరిహద్దుల్లో అపాచీ హెలికాప్టర్ల మోహరం
న్యూఢిల్లీ: , 3 జూలై (హి.స.)పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో ఉగ్రవాద గూళ్లపై దాడులకు భారత సైన్యం ముందు నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత సరిహద్దు ల్లో రక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అత్యాధునిక ఆపాచీ AH-64E
పాక్‌ సరిహద్దుల్లో అపాచీ హెలికాప్టర్ల మోహరం


న్యూఢిల్లీ: , 3 జూలై (హి.స.)పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో ఉగ్రవాద గూళ్లపై దాడులకు భారత సైన్యం ముందు నుంచి

కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత సరిహద్దు ల్లో రక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అత్యాధునిక ఆపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను భారత్ మోహరించనుంది. ఈ మేరకు ఇప్పటికే అమెరికాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

అమెరికా తయారీ ఆధునిక యుద్ధ హెలికాప్టర్లు ‘అపాచీ AH-64E’లు ఈ నెలలో భారత్‌కు చేరనున్నాయి. మొదటి విడతగా మూడు హెలికాప్టర్లు జూలై నెలలో భారత్‌కి రానుండగా, మిగిలిన మూడు 2024 చివర్లో అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 అపాచీల కొరకు భారత్ 2020లో అమెరికాతో 600 మిలియన్ డాలర్లు (అంటే సుమారు రూ. 5000 కోట్లు) విలువైన ఒప్పందాన్ని చేసుకుంది.

ప్రారంభంగా 2024 మార్చిలోనే డెలివరీ పూర్తవ్వాల్సి ఉండగా, పలు లాజిస్టిక్ కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇప్పుడు తిరిగి ప్రక్రియ వేగాన్ని పుంజుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande