ప్రధాని మోదీకి ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డు
న్యూఢిల్లీ: , 3 జూలై (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. ఇది పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్రలోని కోటోక
ప్రధాని మోదీకి ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డు


న్యూఢిల్లీ: , 3 జూలై (హి.స.)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. ఇది పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్రలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనా స్వాగతం పలికి 21 తుపాకీలతో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోడీకి ఘనా రెండవ జాతీయ అత్యున్నత పౌర గౌరవం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధాని మోదీకి ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డును ప్రదానం చేశారు.

జాతీయ గౌరవం లభించడం పట్ల ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ.. “ఘనా జాతీయ గౌరవం దక్కడం నాకు చాలా గర్వకారణం, గౌరవం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1.4 బిలియన్ల భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తున్నాను ఈ గౌరవాన్ని మన యువత ఆకాంక్షలకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నాను” అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande