ఊగిసలాటలో దేశీయ మార్కెట్ సూచీలు
న్యూఢిల్లీ: 3 జూలై (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో రోజును మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు నడుమ.. మన మార్కెట్లలో ఊగిసలాట కనిపిస్తోంది. తొలుత సూచీలు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టినప్పటికీ.. కాసేపటికే అవి నష్టాల్
ఊగిసలాటలో దేశీయ మార్కెట్ సూచీలు


న్యూఢిల్లీ: 3 జూలై (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో రోజును మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు నడుమ.. మన మార్కెట్లలో ఊగిసలాట కనిపిస్తోంది. తొలుత సూచీలు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టినప్పటికీ.. కాసేపటికే అవి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ వెంటనే మళ్లీ లాభాల్లోకి వెళ్లాయి.

ఉదయం 9.34 గంటల సమయంలో నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 25,463 వద్ద, సెన్సెక్స్‌ 36 పాయింట్లు పెరిగి 83,446 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ సూచీలో ఏషియన్ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కొటక్‌మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ట్రెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ స్టాక్స్‌ నష్టాల్లో కదలాడుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లలో అదే ఒరవడి కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande