శ్రీనగర్, 3 జూలై (హి.స.)కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) బాల్టాల్ బేస్ క్యాంప్ (Baltal Base Camp) నుండి అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) కోసం తన పాదయాత్రను ప్రారంభించారు. హెల్త్ చెకప్ తర్వాత ఆమె.. తన యాత్రను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ రోజు మేము అందరం భోలేనాథ్ దర్శనం చేసుకోబోతున్నాం. ఇది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దేవుడు మనందరినీ ఆశీర్వదించాలి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రజలు ఆనందంగా ఉన్నారు... అని చెప్పుకొచ్చారు. అయితే పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం ఈ అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్రాలు ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. అమర్‌నాథ్ యాత్రకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. పహల్గామ్, బాల్టాల్.. బాల్టాల్ మార్గం గండర్‌బల్ జిల్లాలోని సోనమార్గ్ సమీపంలో ఉన్న బాల్టాల్ నుండి ప్రారంభమై, పవిత్ర గుహకు సుమారు 14 కి.మీ. దూరంలో ఉంది. ఈ మార్గం చిన్నదైనప్పటికీ, దాని ఎత్తైన భూభాగం, నీటి ఒడ్డున ఉన్న ఇరుకైన మార్గం కారణంగా ఇది కొంత కష్టతరమైనది. ఈ యాత్ర సాధారణంగా 1-2 రోజులలో (రౌండ్ ట్రిప్) పూర్తవుతుంది. కానీ ఇది వృద్ధులకు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి