! కూలీ రిలీజ్.. సెలవు‌తో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ
అమరావతి, 13 ఆగస్టు (హి.స.) ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్టు 14కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు బడా సినిమాల రిలీజ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్
కూలీ రి


అమరావతి, 13 ఆగస్టు (హి.స.)

ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్టు 14కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు బడా సినిమాల రిలీజ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. బుకింగ్స్ లోనూ ఈ సినిమాలు పోటీపడుతున్నాయి. రెండు సినిమాలకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక కూలీ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోబిన్ , టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మోనికా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది మోనికా సాంగ్. కూలీ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది.

ఇదిలా ఉంటే కూలీ సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని సంస్థలు స్వచ్చందంగా సెలవలు ప్రకటించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయినా ఓ సంస్థ యజమాని కూలీ రిలీజ్ రోజున తమ సంస్థకు సెలవు ఇవ్వడంతో పాటు సినిమా టికెట్స్ కూడా ఇచ్చింది. యూనో ఆక్వా కేర్‌ అనే సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో పాటు ఉచితంగా సినిమా టికెట్లు అందించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం ఉన్న బ్రాంచ్‌ల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది. సెలవు, టికెట్స్ తో పాటు ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాలు అందించడం అలాగే ప్రజలకు స్వీట్లు పంపిణీ చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఇతర సంస్థల ఉద్యోగులు కూడా తమకు కూడా కూలీ రిలీజ్ రోజున సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande