ముంబై, 22 ఆగస్టు (హి.స.)
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. తగ్గింపు సమయంలో స్వల్పంగా తగ్గుతూ పెరిగే సమయంలో అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. తాజాగా ఆగస్ట్ 22వ తేదీన మళ్లీ దూసుకుపోయింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం మాత్రం తులం బంగారంపై ఏకంగా 640 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310 ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,530 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,460 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310 ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310 ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి