స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..నగరాల వారీగా రేట్లు
ముంబై, 25 ఆగస్టు (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల స్థాయి నుంచి దిగి రావడం లేదు. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 25న గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్
Gold


ముంబై, 25 ఆగస్టు (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల స్థాయి నుంచి దిగి రావడం లేదు. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 25న గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి (gold silver prices on august 25 2025).

ఈ నేపథ్యంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,01,610కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,140 వద్ద నిలిచింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900కు చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థానిక డిమాండ్, సరఫరా, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140, 24 క్యారెట్ల ధర రూ.1,01,610గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.93,140, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా కలదు. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా ఉంది. చెన్నైలో కూడా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.93,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,01,610గా నమోదైంది.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande