పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.) ఏదో ఒకటి, రెండు రోజులు తప్ప, బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబైతో సహా మీ నగరంలో 24 క్యారెట్లు, 22 క్యారె
gold


ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.)

ఏదో ఒకటి, రెండు రోజులు తప్ప, బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబైతో సహా మీ నగరంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,160 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,11,290, 22 క్యారెట్ల ధర రూ.1,02,040 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,11,160, 22 క్యారెట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,11,700 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,02,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

కోల్‌కతా 24క్యారెట్ల బంగారం ధర రూ.1,11,160 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande