మోదీ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదానం.. ఒక్క రోజే 56,265 యూనిట్ల బ్లడ్ సేకరణ
గాంధినగర్, 17 సెప్టెంబర్ (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి ఈ రోజు బుధవారం (సెప్టెంబర్ 17) అడుగుపెట్టనున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్‌ డొనేషన్‌ కార్యక్రమాన్ని గుజరాత్‌లో నిర్వహించారు. దీనిని అఖిల్ భారత
World’s biggest blood donation camp at Narendra Modi Stadium on PM’s 75th birthday


గాంధినగర్, 17 సెప్టెంబర్ (హి.స.)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి ఈ రోజు బుధవారం (సెప్టెంబర్ 17) అడుగుపెట్టనున్నారు.

మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్‌ డొనేషన్‌ కార్యక్రమాన్ని గుజరాత్‌లో నిర్వహించారు. దీనిని అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ (ABTYP) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ ‘నమో కే నామ్ రక్తదాన్’ బ్లడ్‌ డొనేషన్‌ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పాల్గొన్ని ప్రపంచ రికార్డు సృష్టించాయి. ఏకంగా 378 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి, నిన్న రాత్రివరకూ 56,265 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దేశ చరిత్రలో ఒక నాయకుడి పుట్టినరోజు కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇంత భారీ మొత్తంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

నమో కే నామ్ రక్తదాన్ మెగా రక్తదాన శిబిరాన్ని గుజరాత్ ఆరోగ్య మంత్రి, గుజరాత్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హృషికేష్ పటేల్ స్టేడియంలో ప్రారంభించారు. గుజరాత్‌లోని 378 కి పైగా వివిధ ప్రదేశాలలో ఈ డ్రైవ్ ద్వారా మెగా రక్తదానం జరిగింది. తేరాపంత్ యువక్ పరిషత్ నుండి సుమారు 1500 మంది వాలంటీర్లు, జాతీయ సేవా పథకం (NSS) నుంచి 500 మందికి పైగా వాలంటీర్లు ఈ శిబిరంలో సహాయం అందించారు. గుజరాత్ అంతటా 75కి పైగా బ్లడ్ బ్యాంకులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande