క్లౌడ్‌బరస్ట్ కారణంగా మళ్లీ వరదల బీభత్సం.. 18 మంది మృతి
డెహ్రాడూన్, 17 సెప్టెంబర్ (హి.స.)న రాత్రి ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్ లలోని పలు జిల్లాల్లో క్లౌడ్‌బరెస్ట్‌ (Cloudburst) అయింది. దీంతో ఒక్కసారిగా భారీ వరదలు తలెత్తాయి. అలాగే పలు ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగి.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరా
క్లౌడ్‌బరస్ట్ కారణంగా మళ్లీ వరదల బీభత్సం.. 18 మంది మృతి


డెహ్రాడూన్, 17 సెప్టెంబర్ (హి.స.)న రాత్రి ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్ లలోని పలు జిల్లాల్లో క్లౌడ్‌బరెస్ట్‌ (Cloudburst) అయింది. దీంతో ఒక్కసారిగా భారీ వరదలు తలెత్తాయి. అలాగే పలు ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగి.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ శాస్త్రధార, తపోవన్, ఐటీ పార్క్ ప్రాంతాలు, కార్లిగాడ్, మాల్‌దేవ్తా లలో ఈ ప్రాణహనికర ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే మరికొన్ని చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరగగా పర్వత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య స్థలాలు, వాహనాలు ఇంకా వంతెనలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌‌లో మండి జిల్లాలోని నిహ్రీ ప్రాంతంలోని ఒక ఇంట్లో ల్యాండ్ స్లైడ్ రావడం వలన కుటుంబ సభ్యులు మరణించగా, దరంపుర్ బస్ స్టాండ్ వరదల ద్వారా దెబ్బతిన్నది.

ప్రభుత్వం, విపత్తు ప్రతిస్పందనా బృందాలు (SDRF, NDRF), స్థానిక అధికారులు రక్షణా చర్యలు ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యాలయాలు మూసివేయబడ్డాయి. రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. అర్ధరాత్రి ఆకస్మీకంగా వచ్చిన వరదల కారణంగా తెల్లవారి లేచి చూసే సరికి స్థానిక ప్రజలకు భయానక పరిస్థితలు కనిపించాయి. ఇదిలా ఉంటే ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా డెహ్రడూన్, తెహ్రీ, హరిద్వార్ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande