తగ్గిన అమెరికా వడ్డీ రేట్లు.. లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ముంబయి,18, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి (Stock Market Today). ఫెడ్‌ రేట్ల కోత సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయనే ఆశలు కూడా వీటికి తోడయ్యాయి. ద
తగ్గిన అమెరికా వడ్డీ రేట్లు.. లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు


ముంబయి,18, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి (Stock Market Today). ఫెడ్‌ రేట్ల కోత సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయనే ఆశలు కూడా వీటికి తోడయ్యాయి. దీంతో లోహ పరిశ్రమ మినహా మిగిలిన రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 352 పాయింట్ల లాభంతో 83,040 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు పుంజుకొని 25,418 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.97గా ఉంది.

ఏ షేర్లు ఎలా..?

నిఫ్టీ సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ నష్టాల్లో ఉన్నాయి. కాగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌.. అంచనాలకు తగ్గట్లుగానే కీలక రేట్లలో 0.25% కోత విధించింది. ఈ ఏడాదిలో మరో రెండు సార్లు కోత ఉంటుందని ఫెడ్‌ సంకేతాలిచ్చింది. దీంతో వడ్డీ రేట్లు 4-4.25 శాతానికి పరిమితమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande