బోయింగ్, హనీవెల్‌పై ఎయిర్ ఇండియా ప్రయాణికుల ఫ్యామిలీ న్యాయ పోరాటం
అహ్మదాబాద్‌/ముంబయి,18, సెప్టెంబర్ (హి.స.) అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన నలుగురు ప్రయాణికుల కుటుంబాలు అమెరికాలోని డెలావేర్ సుపీరియర్ కోర్టులో బ
AIR INDIA


అహ్మదాబాద్‌/ముంబయి,18, సెప్టెంబర్ (హి.స.)

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన నలుగురు ప్రయాణికుల కుటుంబాలు అమెరికాలోని డెలావేర్ సుపీరియర్ కోర్టులో బోయింగ్, హనీవెల్ కంపెనీలపై దావా వేశాయి (Air India Crash Lawsuit). ఈ కంపెనీల నిర్లక్ష్యం, లోప భూయిష్ట ఫ్యూయల్ కటాఫ్ స్విచ్ కారణంగానే ఈ విషాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు.

బుధవారం దాఖలైన ఈ ఫిర్యాదు ప్రకారం, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ఉన్న ఫ్యూయల్ కటాఫ్ స్విచ్‌ను బోయింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అయితే దాన్ని తయారు చేసిన హనీవెల్ కంపెనీ ఈ లోపానికి బాధ్యత వహించాలని ఫిర్యాదు తెలిపింది. స్విచ్‌లోని లాకింగ్ మెకానిజం సరిగ్గా పనిచేయకపోవడం, అది సులభంగా తొలగిపోయే అవకాశం ఉండటం వల్ల ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో టేకాఫ్ సమయంలో అవసరమైన థ్రస్ట్ లభించలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande