అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ మేనియా నడుస్తోంది. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుండగా.. ఇప్పటికే తొలిరోజు షోలు ఆల్ మోస్ట్ ఫుల్ అయ్యాయి. టికెట్ ధర ఎంతైనా సరే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులుగా తొలిరోజు సినిమా చూసి తీరాల్సిందేనంటున్నారు. ఆఫ్ లైన్లో టికెట్ల ప్రీ బుకింగ్స్ కోసం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. కాగా.. కొన్నిచోట్ల ఓజీ మూవీ టికెట్లను (OG Movie Tickets) వేలం వేస్తుండగా.. ఒక్కొక్క టికెట్ వేలు, లక్షల్లో అమ్ముడవుతుండటం విశేషం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానిగా భీమిలి భీమిలి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నక్క శ్రీధర్ ఓజీ టికెట్ ను రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. పవన్ కల్యాణ్.. సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్టీ బలోపేతానికి, సంక్షేమానికి వెచ్చిస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతుగా ఈ వేలంలో పాల్గొన్నట్లు శ్రీధర్ తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి