స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..మీ నగరంలో రేట్లు ఇలా
ముంబై, 22 సెప్టెంబర్ (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మార్కెట్ పరిస్థితులు వీటిని ప్రభావితం చేస్తాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం నాటికి వీటి ధరల్లో స్పల్ప తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 2
Gold


ముంబై, 22 సెప్టెంబర్ (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మార్కెట్ పరిస్థితులు వీటిని ప్రభావితం చేస్తాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయం నాటికి వీటి ధరల్లో స్పల్ప తగ్గుదల కనిపించింది.

ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 22, 2025) ఉదయం 6:15 గంటల నాటికి, హైదరాబాద్, ముంబైలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.1,12,140కి చేరగా, 22 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,02,790కి చేరింది. మరోవైపు వెండి కిలో ధర హైదరాబాద్, కేరళలో రూ.100 తగ్గి రూ.1,34,900కు చేరుకుంది. ఇదే సమయంలో ఇతర నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

బంగారం, వెండి ధరల తాజా అప్డేట్

భారతదేశంలోని వివిధ నగరాల్లో గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం 24 క్యారెట్ బంగారం (10 గ్రాముల) ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో రూ.1,12,290, చెన్నైలో రూ.1,12,250, కోల్‌కతా, పూణేలో రూ.1,12,140, బెంగళూరు, వడోదరలో రూ.1,12,140. ఇక వెండి ధరల విషయానికొస్తే, బెంగళూరులో ఒక కిలోకు రూ.1,33,500గా ఉంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో రూ.1,44,900గా, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పూణే, వడోదరలో రూ.1,34,900గా ఉన్నాయి.

ఈ ధరలు నగరాలను బట్టి మారుతున్నాయి. బంగారం ధరలు ఢిల్లీలో అత్యధికంగా, కోల్‌కతా, పూణే, బెంగళూరు, వడోదరలో కొంచెం తక్కువగా ఉన్నాయి. వెండి ధరలు హైదరాబాద్, చెన్నై, కేరళలో ఎక్కువగా, బెంగళూరులో తక్కువగా ఉన్నాయి. బంగారానికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుందన్నారు. ఈ సీజన్‌లో బంగారం కొనుగోలు కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాక, ఆర్థిక భద్రత కోసం కూడా ఉపయోగపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande