ముంబై, 18 సెప్టెంబర్ (హి.స.)ఈరోజుల్లో బంగారం, వెండి ధరలు (Gold-Silver Price Today) కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఒక విధంగా బంగారం ధరలు మహిళలను తికమక పెడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుండు ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఒక్క రోజు కూడా నిలకడగా ఉండే పరిస్థితి లేదు. గంటల వ్యవధుల్లోనే బంగారం ధరల్లో మార్పులు ఉంటున్నాయి. సెప్టెంబర్ 18 గురువారం బంగారం ధర అతి స్వల్పంగా తగ్గినా.. పెద్ద ఊరట కల్పించేవిది లేదు. ఎందుకంటే తగ్గినప్పుడు పదుల సంఖ్యలో తగ్గితే.. పెరిగినప్పుడు వందల సంఖ్యలో పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే సుమారు లక్షా 12 వేల రూపాయల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,540 ఉంది.వెండి కూడా కిలోకు రూ.1 లక్షా 31,900లకు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం, డాలర్ బలహీనత, ప్రపంచ అనిశ్చితి ఇంత భారీ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుగా పరిగణిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి