బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…
ముంబై, 17 సెప్టెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,44,10
gold


ముంబై, 17 సెప్టెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,44,100కి చేరింది.. మరోవైపు, ఆల్ ఇండియా సరాఫా సంఘ్ ప్రకారం, మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,12,090కి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,34,100కి చేరుకుంది.

హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,940ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,02,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,940 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,02,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,44,100 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande