హైదరాబాద్ 22 సెప్టెంబర్ (హి.స.): రానున్న 3 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ