దసరా వేడుకల నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..!
విజయవాడ , 22 సెప్టెంబర్ (హి.స.) దసరా ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు (సోమవారం) నుంచి అక్టోబర్ 2 వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర
విజయవాడ


విజయవాడ , 22 సెప్టెంబర్ (హి.స.)

దసరా ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు (సోమవారం) నుంచి అక్టోబర్ 2 వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖరబాబు తెలిపారు. భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండానే ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.

ముఖ్య రూట్ మార్గదర్శకాలు:

1. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారు:

నల్లగుంట నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా చిన్న ఆవుటపల్లి – హనుమాన్ జంక్షన్ మార్గం ఉపయోగించాలి.

తిరుగు ప్రయాణంలో కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి.

2. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లేవారు:

నల్లగుంట వద్ద నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా చిన్న ఆవుటపల్లి – కేసరపల్లి మార్గంలో ప్రయాణించాలి.

తిరుగు ప్రయాణంలో ఇదే మార్గం.

3. హైదరాబాద్‌ నుంచి గుంటూరు/చెన్నై వైపుగా:

నార్కెట్‌పల్లి – నల్గొండ – మిర్యాలగూడ – నడికూడి – పిడుగురాళ్ల – అద్దంకి – మేదరమెట్ల మార్గం.

4. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారు:

ఒంగోలు – త్రోవగుంట – చీరాల – బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ – పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మార్గం.

ఉత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు:

భవానీపురం వైపు నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు:

* తితిదే పార్కింగ్ (కుమ్మరిపాలెం)

* ఎం.వి. రావు ఖాళీ స్థలం

* పున్నమి ఘాట్

* భవానీ ఘాట్

* సుబ్బారాయుడు పార్కింగ్

* సెంట్రల్ వేర్‌హౌస్ గ్రౌండ్

* గొల్లపూడి మార్కెట్ యార్డ్

* భవానీపురం లారీ స్టాండ్

* సోమా గ్రౌండ్

* సితార సెంటర్

* ఎగ్జిబిషన్ గ్రౌండ్

* గొల్లపూడి పంట కాలువ రోడ్డు

గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం:

* బి.ఆర్.టి.ఎస్. రోడ్

* సంగీత కళాశాల మైదానం

* ఎఫ్.ఐ.సి. మట్టి రోడ్డు పార్కింగ్

* జింఖానా మైదానం

భక్తులు ముందుగానే తమ ప్రయాణ మార్గాన్ని, పార్కింగ్ ఏర్పాట్లను తెలుసుకుని ప్రణాళిక చేసుకోవాలని, నగర ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని కమిషనర్‌ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవడానికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande